Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జియో ఫోన్‌ యూజర్లకు తీపి కబురు

jio

రిలయన్స్ జియో అనతికాలంలో కోట్లాదిమంది వినియోగాదారులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం జియో 4జి ఫీచర్ ఫోన్‌తో మరో సంచలనానికి తెరలేపింది. తాజాగా జియో 4జి ఫీచర్ ఫోన్ వాడుతున్న కస్టమర్లకు సంస్థ తీపికబురు అందించింది. ఈ ఫోన్‌లో ఆఫిషియల్‌గా ఫేస్‌బుక్ యాప్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ ఫోన్ వినియోగదారులకు ఫేస్‌బుక్ యాప్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి ఈ యాప్‌ను వినియోగదారులు జియో ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో వారు జియో ఫోన్‌లోనూ ఫేస్‌బుక్ సేవలను పొందొచ్చు. ఇప్పటికే జియో ఫోన్‌కు గాను గూగుల్ అసిస్టెంట్ యాప్ లభిస్తుండగా ఆ లిస్ట్‌లోకి తాజాగా ఫేస్‌బుక్ యాప్ వచ్చి చేరింది. ఈ ఫోన్‌లో ఉండే కాయ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ యాప్‌ను డెవలప్ చేసినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

Jio Phone to Get Official Facebook App on Wednesday.

Comments

comments