Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జియో ఫోన్ బుకింగ్ నేటి నుంచే..

JIO

న్యూఢిల్లీ : ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రిలయన్స్ జియో ఫోన్ బుకింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ప్రి-బుకింగ్ షురూ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఇండియా స్మార్ట్‌ఫోన్ అంటూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గత నెలలో రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త పోన్‌ను పరిచయం చేశారు. ఉచితంగా అందించే ఫోన్ అయినప్పటికీ రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని తెలిపారు. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును తిరిగి వినియోగదారులకే ఇస్తామని జియో ప్రకటించింది.  ఆగస్టు 24 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. బుకింగ్ సమయంలో కేవలం వినియోగదారులు తమ వివరాలు మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. ఫోన్ చేతికి అందిన వెంటనే రూ.1500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జియో ఫోన్ ఫీచర్లు .. 2.4 అంగుళాల స్క్రీన్, ఆల్ఫాన్యూమరిక్ కీబోర్డుతో డిజైన్ చేశారు. దేశంలో 22 భాషలను సపోర్ట్ చేస్తుంది, వాయిస్ కమాండ్ ద్వారా పనిచేస్తుంది. జియో సినిమా యాప్‌లో సినిమాలు, టీవీ ఛానల్స్ ఉచితంగా చూడవచ్చు,  కీపాడ్‌లో నెంబర్ 5లో అత్యవసర కాలింగ్ విధానాన్ని పొందు పరిచారు. నియర్ ఫీల్ కమ్యునికేషన్ (ఎన్‌ఎఫ్‌సి) టెక్నాలజీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. మెమోరీ కార్డు ద్వారా ఫోన్ మెమోరీ పెంచుకోవచ్చు. విజిఎ కెమెరా ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఎం రేడియో, ఆడియో ప్లేయర్ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో బ్లూటూత్ టెక్నాలజీ 4.10 వెర్షన్ ఉపయోగించారు. డ్యూయెల్ సిమ్ సదుపాయం ఉంది. రెండు సిమ్‌స్లాట్‌లు విఒఎల్‌టిఇని సపోర్ట్ చేస్తాయి. ఇక బుకింగ్స్‌ను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం…

వైబ్‌సైట్ ద్వారా..
*అధికారిక వెబ్‌సైట్ జియో.కామ్‌లోకి వెళ్లండి
* మీ మొబైల్ నంబరు, పిన్ కోడ్‌ను నమోదు చేయాలి. ( ప్రి బుకింగ్ ప్రక్రియ కోసం ఆధార్ వివరాలు అవసరం లేదు)
* మొత్తాన్ని చెల్లించి, ఫోన్‌ను బుక్ చేసుకోవాలి
* మీరు విజయవంతంగా Jio ఫోన్‌ను బుక్ చేసుకుంటే ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశం వస్తుంది.
మై జియో యాప్ ద్వారా…
* మీ ఫోన్లో మై జియో యాప్‌ను ఓపెన్ చెయ్యాలి
* జియో ప్రీ బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* మీ మొబైల్ నంబర్, పిన్ కోడ్ ( ప్రి బుకింగ్ ప్రక్రియ కోసం ఏ ఆధార్ వివరాలు అవసరం లేదు) నమోదు చేయాలి.
* మొత్తాన్ని చెల్లించి, ఫోన్‌ను బుక్ చేసుకోండి.
* ఇలాగ మీరు విజయవంతంగా జియో ఫోన్ ను బుక్ చేసుకుంటారు
ప్రీ బుకింగ్ : ఆఫ్లైన్ ప్రాసెస్
* సమీప జియో స్టోర్ లేదా రిటైల్ స్టోర్‌కు వెళ్లండి (అక్కడ జియో ఫోన్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది).
* రిటైలర్‌కు అవసరమైన వివరాలు ఇవ్వాలి. రూ. 500 చెల్లించాలి.
* మీరు జియో ఫోన్ విజయవంతమైన బుకింగ్ చేసుకున్నట్టు ఎస్‌ఎంఎస్ వస్తుంది.
* రిటైలర్ మీకు అదే రసీదుని ఇస్తారు.

Comments

comments