Search
Wednesday 14 November 2018
  • :
  • :

మరో సంచలనానికి ‘జియో’ నాంది

Jio Prime Membership Extended to One Year

ముంబయి: టెలికాం రంగంలో అనతికాలంలోనే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో తాజాగా మరోసారి మార్కెట్‌పై దండయాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రీపెయిడ్ కస్టమర్లపై దృష్టిసారించిన జియో ఇకనుంచి పోస్టుపెయిడ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. దేశంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల నుంచి టెలికాం రంగానికి 25శాతం ఆదాయం వస్తుండటంతో జియో ఈ సంచలన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రూ. 199తో సరికొత్త పోస్టు పెయిడ్ ప్లాన్‌ను ఈ నెల 15 నుంచి అందుబాటులోకి తీసుకురానుందట. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు 25 జిబి డేటా, నిమిషానికి 50 పైసలతో ఇంటర్నెషనల్ కాల్స్, నిమిషానికి రూ. 2తో ఇంటర్నెషనల్ రోమింగ్ అందించనుంది. అలాగే జియో యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. పోస్టుపెయిడ్ సెగ్మెంట్‌లో ఇదే అత్యంత చౌకైన ప్లాన్. ఇక ఎయిర్‌టెల్ రూ. 389, వొడాఫోన్ ఇండియా, ఐడియాలు రూ. 399తో 20జిబి డేటా, రూ. 149తో ఇంటర్నెషనల్ రోమింగ్‌ను ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే.

Comments

comments