Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

‘జియో’ ప్రైమ్‌ కస్టమర్లకు తీపికబురు…

Jio Prime Membership Extended to One Year

ముంబయి: రిలయన్స్‌ జియో అనతికాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుని దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు వరుసగా కొత్త ఆఫర్లు, ప్లాన్లు తీసుకొస్తున్న జియో తాజాగా మరోసారి తీపికబురు అందించింది. జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తుది గడువు మార్చి 31(శనివారం)తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తన ప్రస్తుత జియో ప్రైమ్‌ మెంబర్లకు అదనంగా ఏడాది పాటు కాంప్లిమెంటరీ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను అందించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీనికోసం జియో కస్టమర్లు మైజియో యాప్‌లోకి లాగిన్‌ అయి జియో మెంబర్లు కాంప్లిమెంటరీ జియో మెంబర్‌షిప్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దాంతో మరో ఏడాది పాటు కాంప్లిమెంటరీ ఫ్రీ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందవచ్చని జియో వెల్లడించింది. కాగా, గతేడాది జియో రూ.99లతో ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త జియో వినియోగదారులకు కూడా ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధర అదేవిధంగా ఉంటుందని జియో స్పష్టం చేసింది. అయితే కొత్త కస్టమర్లు రూ.99 చెల్లించి ప్రస్తుతం ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది. పాత వినియోగదారులకు మాత్రం ఉచితంగా మరో ఏడాది పాటు ఈ సర్వీసులను పొందవచ్చు.

Comments

comments