Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్‌

Jio

ముంబయి: రిలయన్స్ జియో మరోసారి తన వినియోగదారుల కోసం రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని ప్లాన్లను సవరిస్తూ అదనపు డేటా అందించడానికి సిద్ధమైంది. హ్యాపీ న్యూఇయర్ 2018 ఆఫర్ కింద జనవరి మొదట్లో కొన్ని ప్లాన్లను సవరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సవరించిన ప్లాన్లతో జియో వినియోగదారులకు అదనంగా 50 శాతం డేటా అందించనుంది. రూ. 149 ఆ పైబడి 1జిబి డేటా ప్యాక్‌లపై ఇకపై 1.5జిబి, 1.5జిబి డేటా ప్యాక్‌లపై 2జిబి డేటా అందించనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి ఈ ప్లాన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని జియో అధికారులు వెల్లడించారు. తాజాగా సవరించిన ప్లాన్ల పూర్తి వివరాలు కింది పట్టికలో చూడొచ్చు.

Jio Republic Day 2018

Comments

comments