Search
Sunday 23 September 2018
  • :
  • :

జియో వినియోగదారులకు శుభవార్త..!?

Jio-Record

న్యూఢిల్లీ : ఇప్పటి వరకు వినియోగదారులకు  ఉచిత కాల్స్, డేటా అందించిన రిలయన్స్ జియో త్వరలో మరో శుభవార్త అందించనుందటా. ఉచిత ఆఫర్లు ఈ నెల 31తో ముగియనున్న తరుణంలో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ద్వారా రూ.99 రిచార్జీతో వినియోగదారులు ఉచితంగా కాల్స్ పొందవచ్చు. అనంతరం రూ.149 నుంచి రూ.9999 వరకు వివిధ రకాల టాప్‌అప్ రిచార్జీతో డేటాను పొందవచ్చు. కాగా ప్రైమ్ మెంబర్‌షిప్ నమోదు గడువు ఈ నెల 31తో ముగియనుంది. అయితే ఈ గడువును మరో నెల రోజుల పాటు కొనసాగించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును ఏప్రిల్ 30 వరకు జియో కొనసాగించనుందని టెలీ అనాలసీస్ సంస్ధ పేర్కొంది. కానీ ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ప్రకటన వెలువడించలేదు.

Comments

comments