Home బిజినెస్ 3 కోట్ల కాలేజీ విద్యార్థులకు జియో వైఫై

3 కోట్ల కాలేజీ విద్యార్థులకు జియో వైఫై

JIO

ముంబయి: ఉచిత వాయిస్, డాటాలతో సంచలనం సృష్టి స్తున్న రిలయన్స్ జియో త్వరలో ఫోన్‌ను కూడా తీసు కురానుంది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది కాలేజీ విద్యార్థులకు వైఫై ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జియో ఇప్పటికే మానవవనరుల శాఖకు ఓ ప్రతిపాదన(హెచ్‌ఆర్‌డి)ను సమర్పించినట్టు సమాచారం. గత నెలలో హెచ్‌ఆర్‌డికు ఇచ్చిన ప్రతిపాదనలో దేశంలోని 38 వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని చెప్పినట్లు తెలిసింది. భవిష్య త్తులో దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు ఇస్తామని చెప్పినట్లు నివేదికలు తెలిపాయి. వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో చెప్తుండ టంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని ఓ చ్‌ఆఆర్‌డి అధికారి చెప్పారు. మిగిలిన కంపెనీ లకు అవకాశం ఇవ్వకుండా జియోకే పట్టం కట్టడం సరికా దు టెండర్ ప్రక్రియను చేపడతామని అన్నారు. అయితే ఉచితంగా సర్వీసులు జియో ఇవ్వాలని ప్రతిపాదించినం దువల్ల టెండర్ దానికే వస్తుందని భావిస్తున్నారు.
జియోఫోన్‌తో ప్రత్యర్థి కంపెనీలకు సవాల్
మరోవైపు త్వరలో రానున్న జియోఫోన్‌తో ఇతర కంపెనీల కు క్లిష్ట పరిస్థితులు ఎదురు కానున్నాయనిని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జాఫరీస్ తన నివేదికలో పేర్కొంది. జియో ఫోన్ 50 కోట్ల మంది వినియోగదారులను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇతర టెల్కోలు తమ విని యోగదారులను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించా ల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌లో అడుగుపెట్టిన జియో 10 కోట్ల మంది వినియో గదారులను లక్ష్యంగా పెట్టుకుంది. సంవత్సరం తిరిగేసరికి మరో సంచలన 4జీ ఫీచర్ ఫోన్‌తో ముందుకొచ్చింది. జియో నెలవారీ ప్లాన్ మూడు ప్రధాన టెల్కోలకు భిన్నంగా ఉంది.