Home వార్తలు జియో ఆఫర్‌కు ట్రాయ్ క్లీన్‌చిట్

జియో ఆఫర్‌కు ట్రాయ్ క్లీన్‌చిట్

Jio-Recordన్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఆఫర్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) క్లీన్ చిట్ ఇచ్చింది. జియో అందిస్తున్న జీవితకాలపు ఉచిత వాయిస్ కాలింగ్ సేవలు వివక్షపూరితమైనవి కావని ట్రాయ్ స్పష్టం చేసింది. జియో అందిస్తున్న ఆఫర్ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తేల్చి చెప్పింది. జియో సిమ్‌తో టెలికాం రంగంలో రిలయన్స్ సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. జీవిత కాలంపాటు లోకల్, ఎస్‌టీడీ, నేషనల్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు రిలయన్స్ గత సెప్టెంబర్‌లో ప్రకటించింది. దీంతో పాటు డిసెంబర్ 31వరకు ఉచిత అపరిమిత ఇంటర్నెట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది. జియో ప్రకటనపై మిగతా టెలికాం ఆపరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. జియో ఆఫర్ మార్కెట్‌ను దోపిడీ చేసేలా ఉందని ఆరోపించారు. ప్రస్తుత నిబంధనలకు అనుకూలంగా ఆఫర్ లేదని, అది పూర్తిగా వివక్షపూరితమైనదని పేర్కొన్నారు. ఈ విషయమై ఎయిర్‌టెల్, వొడాఫోన్ సహా పలు టెలికాం ఆపరేటర్లు ట్రాయ్‌ను ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను కొట్టిపడేస్తూ.. జియో ఆఫర్‌కు ట్రాయ్ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు టెలికాం ఆపరేటర్లకు రాసిన లేఖలో ట్రాయ్ పేర్కొంది. ఆఫర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవని ట్రాయ్ స్పష్టం చేసింది. కాగా ట్రాయ్ నిర్ణయంపై రిలయన్స్ జియో హర్షం వ్యక్తం చేసింది.