Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

జియో మరో బంపర్ ఆఫర్..!!

Relaince-jio-offer-image

టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన ప్రైమ్ మెంబర్ల కోసం 100 శాతం  క్యాష్‌బ్యాక్ పేరిట ఓ సరికొత్త బంపర్ ఆఫర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రకారం జియో ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.398 లేదా ఆపైన విలువ గల ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వాళ్లకు  100 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుందని రిలయన్స్ వెల్లడించింది. ప్రైమ్ మెంబర్లకు  రూ.400 విలువ గల 8 కూపన్లు పొందవచ్చు. ఒక్కో కూపన్ విలువ రూ.50 వరకు ఉంటుంది. వీటిని  తదుపరి చేసుకునే రీచార్జిలపై వాడుకొని  డిస్కౌంట్ పొందొచ్చు. ఇక జియో పార్ట్‌నర్ వాలెట్స్‌లో రీచార్జి చేసుకుంటే యూజర్లకు రూ.300 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్‌కు ఈ నెల 31వ తేదీ వరకు గడువుంది. రూ.398 ఆపైన రూ.700 లోపు చేసుకున్న రీచార్జిలకు ఈ ఆఫర్ అందుబాటులోంది.

Comments

comments