Home వార్తలు మే12 న సిద్దిపేట లో జాబ్ మేళా:మంత్రి హరీష్‌రావు

మే12 న సిద్దిపేట లో జాబ్ మేళా:మంత్రి హరీష్‌రావు

Job Mela at Siddipeta on May 12th
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్‌ః సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 12 న జాబ్ మెళా నిర్వహిస్తున్నుట్లు మంత్రి హరీష్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా వివరాలు తెలుపుతు బికాం.ఎంబిఎ (ఫైనాన్స్) అర్హత కలిగిన యువతి యువకులకు ఈ జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఫిఫ్త్ రీచ్ స్టాటర్జిక్ సోల్యూషన్స్ ప్రైవేటు వారి సౌజన్యంతో 12 న ఉదయం 9 గంటల నుండి బైపాస్ రోడ్డులోని ట్రాఫిక్ పోలిస్ స్టెషన్ ఎదురు గా ఉన్న ఉపాద్యాయ భవన్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జాబ్ మెళాకు వచ్చె అభ్యర్ధులు fifthreach.org నందు రిజిస్ట్రెషన్ చేసుకొని లేదా అభ్యర్ధులు తమ తమ సర్టిఫికేట్ ఆదార్ కార్డులతో అలాగే ఒక ఫోటో తో హజరు కావల్సిందిగా సూచించారు.బికాం,ఎంబిఎ పూర్తి చేసిన అభ్యర్ధులు మాత్రమె ఈ జాబ్ మేళాకు హజరు కావాలని తెలిపారు.