Home హైదరాబాద్ కోకతట్టీలో జాబ్‌మేళా

కోకతట్టీలో జాబ్‌మేళా

Job Mela in Mallepally ITI

మన తెలంగాణ/చార్మినార్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా దక్షిణ మండల పోలీసులు బుధవారం నిరుద్యోగ యువతీయువకుల కోసం జాబ్ మేళాను నిర్వహించారు. హుస్సేనీఆ లం పోలీసుస్టేషన్ పరిధిలోని కోకతట్టీలో గల పాల్కీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసిన యాకుత్‌పురా శాసనసభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్, నగర అదన పు సీపీ దేవేందర్ సింగ్ చౌవాన్‌తో కలిసిప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ ఫ్రెండ్లీపోలీసింగ్‌లో భాగం గా పోలీసులు నిరుద్యోగ మేళాను నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యో గ యువత సరియైన ఉద్యోగాలు లభించక పక్కదారి పడుతున్నారని, అలాంటి వాళ్లకు మేళా ఎంతో మేలు చేస్తుందన్నారు. నిరుద్యోగలు తమ పేర్లును, అర్హతలను నమోదు చేసుకునేలా సంచార జాబ్‌మేళా వాహనాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. అదనపు సీపీ దేవేందర్ సింగ్ చౌవాన్ మాట్లాడుతూ విధి నిర్వాహణతోపాటు సేవా కార్యక్రమాలను పోలీసులు నిర్వహించటం స్ఫూర్తి దాయకమన్నారు. దాదాపు 25 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్న 700లకు పైగా నిరుద్యోగుల దరఖాస్తులను స్వీకరించి, తమకు అవసరమైన వారిని అక్కడిక్కడే ఎంపిక చేశారు. కార్యక్రమంలో దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ, అదనపు డిసిపి గౌస్‌మోహినుద్దీన్, ఎసీపీ అంజయ్య, ఇన్‌స్పెక్టర్లు శ్యాంసుందర్,  సుదర్శన్, జావేద్, రవికుమార్, చంద్రశెఖర్‌రెడ్డి,  కార్పొరేటర్లు సోహెల్‌ఖాద్రీ, ముజఫర్ అలీతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.