Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

Job Mela for Unemployed Youth

మన తెలంగాణ/చార్మినార్ : పాతబస్తీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందు కు దక్షిణ మండల పోలీసులు ఆధ్వర్యంలో బుధవా రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆ మండల డీసీపీ వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హుస్సేనీఆలం కోకతట్టీ ప్రాంతంలోని పాల్కీ గార్డెన్‌లో నిర్వహించే ఈ జాబ్ మేళాకు పదవ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదువుకున్న అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. మేళాలో 25 కార్పొరేట్ కంపెనీలు హాజరై తమకు అవసరమైన యువతను ఉద్యోగాలకు ఎంపి క చేస్తారని వెల్లడించారు. యువత తమ అర్హతలను, నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి అవకాశాలను పొం దాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

comments