హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జాగృతి యూత్ కన్వీనర్ ప్రశాంత్ తెలిపారు. జాగృతి కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఎలక్ట్రానిక్, టైలరింగ్, బ్యూటీషియన్,హోటల్ మేనేజ్మెంట్, మీడియా ఆఫ్ ఎంటర్టైన్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ , స్పోకెన్ ఇంగ్లీష్ తదితర రంగాల్లో ప్రావీణ్యం ఉండి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి గల అభ్యర్థులు శనివారం ఉదయం పది గంటలకు అశోక్‌నగర్ జాగృతి స్కిల్ సెంటర్లో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 040-40214215 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు.