Home తాజా వార్తలు జాబ్‌మేళాలో పలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

జాబ్‌మేళాలో పలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

JOB-MELA

మన తెలంగాణ/బేగంపేట్ : సురభి ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ, ఎపిల రాష్ట్రాలోని అచ్చంపేట, కొత్తూరు, వెల్దుర్థ్థి ప్రాంతాలలో నిర్వహించిన సూర్యమిత్ర సోలార్ శిక్షణకోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు జాబ్‌మేళా నిర్వహించారు. బేగంపేట్‌లోని బ్రాహ్మణవాడిలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ కార్యాలయంలో జరిగిన క్యాంపస్ రిక్రూట్‌మెంటుకు పలు ప్రముఖ సోలార్ సంస్థల ప్రతినిదులు హాజరై ఇంటర్వూలు నిర్వహించారు. సో లార్ ఎనర్జీ కార్యక్రమ డైరెక్టర్ శేఖర్ మారం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు జాన్సన్ లిప్ట్, శ్రీ సాయిరాం, ఇన్‌ఫ్రా ఫర్ సోలార్, ఎమొగో స్ ఎనర్జీ, కోయల్ కేర్ (భాగ్యనగర్ డిజల్) రిన్యూసిస్, సూర్యతేజ సోలార్ ఎ నర్జీ తదితర సంస్థల ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి. ఐటిఐతో పాటు సూర్యమిత్ర కోర్సు చేసుకున్నవారికి నెలకు రూ.10,250ల వేతనంతో పాటు ఇఎస్‌ఐ, రావాణ ఖర్చులు అదనంగా చెల్లించేలా ఆయా సంస్థలు ఒ ప్పంద పత్రాలను అందజేశారు. రెండు సంవత్సరాల పాటు ట్రైనింగ్ పూర్తైన తరువాత ఐటిఐ వారికి సంవత్సరానికి రూ.2.25 లక్షలు, డిప్లమా వారికి రూ. 2.50 లక్షలు వేతనంగా అందించనున్నట్లు ప్రకటించారు. ఇతర అలవెన్స్‌లు సదుపాయాలు కొనసాగుతాయని చెప్పారు. సూర్యమిత్ర సోలార్ కోర్సులో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు 100 మందికి పైగా ఇంటర్వూలకు హాజరు కాగా, వారిలో వందమంది ఉద్యోగ ఆఫర్ లెటర్లు అందుకున్నారని సూరభి ఎడ్యుకేషనల్ సోసైటీ ప్రోగ్రాం డైరెక్టర్ శేఖర్ మారంరాజు తెలిపారు.