Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రభుత్వ కొలువులన్నీ ఆ పార్టీ కార్యకర్తలకేనట.?

ANNA-DMK

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె పార్టీ వివాదాస్పద ప్రకటనలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అన్నాడిఎంకె పార్టీ కార్యకర్తలకే ఇస్తామని సాక్షాత్తు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కెఎ సెంగోట్టియన్ ప్రకటన చేయడం పై నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పార్టీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్‌లో ఖచ్చితంగా మీకే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని విద్యాశాఖ మంత్రి హామీనిచ్చారు. తమ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే కార్యకర్తల కోసం తాము ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సెంగోట్టియన్ తేల్చిచెప్పారు. ఇటీవలే మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ.. అన్నాడిఎంకె కార్యకర్తలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై డిఎంకె నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న అన్నాడిఎంకె.. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తుందని ధ్వజమెత్తారు. పళనిస్వామి ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలని డిఎంకె నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments