Search
Friday 16 November 2018
  • :
  • :

11న వరంగల్‌లో జాబ్‌మేళా

JOB-MELA-1

వరంగల్ అర్బన్ : నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న ఉదయం 10 గంటలకు ములుగు రోడ్డులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధి అధికారి వి. వెంకటపతి తెలిపారు. హైదరాబాద్‌లోని అపోలో మెడిస్కిల్స్ కంపెనీలో నాలుగు వందల మంది పారా మెడికల్ ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివి ఉండి, 18 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళా నిరుద్యోగులు మాత్రమే అర్హులని ఆయన వెల్లడించారు. ఇందులో ఎంపికైన వారికి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారని, ఈ సమయంలో హాస్టల్, భోజనం ఉచితంగా కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. అర్హత , ఆసక్తి ఉన్న యువతులు తమ విద్యార్హత, కుల, ఆదాయ , తెలుపు రేషన్‌కార్డు , ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ పాస్‌బుక్ , నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో వరంగల్ ములుగు రోడ్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 7995015042 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

Comments

comments