Home తాజా వార్తలు జోరుగా ఐటి నియామకాలు

జోరుగా ఐటి నియామకాలు

 

 9 నెలల్లో 70,000 ఉద్యోగాలు
 ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్‌లలో వ్యాపార వృద్ధి
 వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మరిన్ని ఉద్యోగాలు: నివేదిక

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201819) ఐటి(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పరిశ్రమలో నియామకాల జోరు కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(201718)తో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. దేశీయంగా నాలుగు దిగ్గజ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థల గణాంకాలను ఎకనమిక్ టైమ్స్ వార్తా సంస్థ పరిశీలించి, ఈ నివేదికను వెల్లడించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లు మొత్తంగా 70,000 మందిని నియమించుకున్నాయి. 201718తో పోలిస్తే ఈ గణాంకాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీలో వేగవంతమైన మార్పులు, సంప్రదాయ వ్యాపారాలపై ఒత్తిడి, ఆటోమేషన్, ప్రధాన మార్కెట్లలో రక్షణాత్మక విధానాలు పెరగడం వంటి కారణాలతో 201718లో ఈ నాలుగు సంస్థలు 13,972 మందిని మాత్రమే నియమించుకున్నాయి.
వ్యాపార వృద్ధి మెరుగైంది: టిసిఎస్
201819 తొలి 9 నెలల్లో 22,931 మంది ఉద్యోగులను నియమించుకోవడంపై టిసిఎస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ, వ్యాపార వృద్ధి మళ్లీ పుంజుకుందని, దీంతో రెండంకెల వృద్ధి రేటు దిశగా పయనిస్తున్నామన్నారు. ఈ సంవత్సరంలో టిసిఎస్ దాదాపు 28 వేల క్యాంపస్ ఆఫర్లను చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో 3,657 మందికి మాత్రమే ఆఫర్ చేసినట్టు నివేదిక తెలిపింది. నియామకాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని, దీనికి కారణం వ్యాపార వృద్ధి అని టిసిఎస్ గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్ అజోయేంద్ర ముఖర్జీ అన్నారు. ‘ముందుగా ఊహించనిదేమీ కాదని, ఎందుకంటే మా లక్షం రెండంకెల వృద్ధిని సాధించడం. మేము మార్కెట్‌ను చూస్తున్నాం. ఇక్కడ అవకాశాలు పొందగలమని నమ్ముతున్నాం’ అని ఆయన అన్నారు.
బిలియన్ డాలర్ల డీల్ పొందాం: ఇన్ఫోసిస్
తొలి మూడు త్రైమాసికాల్లో దేశీయ రెండో అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ దాదాపు 21,398 మందిని నియమించుకుంది. అయితే అంతకుముందు సంవత్సరంలో ఈ సంస్థ నియామకాలు 3,743 మంది మాత్రమే. ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సిఒఒ) ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ, గత మూడు త్రైమాసికాల్లో 1 బిలియన్ డాలర్ల విలువచేసే అతిపెద్ద డీల్‌ను పొందామని, ఇలాంటి డీల్స్ వచ్చే సంవత్సరాల్లోనూ రానున్నాయని అన్నారు.
క్యాంపస్ నియామకాలు రెట్టింపు: విప్రో
ఇదే విధంగా తొమ్మి నెలల కాలంలో హెచ్‌సిఎల్ టెక్, వి ప్రో కంపెనీలు కూడావరుసగా12,247మంది, 12,456 మంది నియామకాలు చేపట్టాయి. ఈ సంస్థలు కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లి నియమాకాలుచేపట్టాయి. క్యాంపస్ సెలక్షన్లను రెట్టింపు చేయాలని విప్రో యోచిస్తోంది.

jobs notifications in IT Department