Home అంతర్జాతీయ వార్తలు ఇండోనేసియా అధ్యక్షుడిగా మళ్లీ జోకో విడోడో

ఇండోనేసియా అధ్యక్షుడిగా మళ్లీ జోకో విడోడో

Joko Widodo

 

జకార్తా: ప్రపంచంలో మూడో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేసియా అధ్యక్షుడిగా జోకో విడోడో తిరిగి ఎన్నికైనట్టు మంగళవారం ప్రకటించారు. అనుకున్న సమయంకన్నా ముందే అధికారికంగా ఎన్నికల ఫలితాలు వెలువడడం ఆశ్చర్యాన్ని కలిగించగా, దేశవ్యాప్తంగా వేలాదిమంది సైనికులు ఆనందంతో పులకించిపోయారు. నిజానికి తుది విడత ఓట్ల లెక్కింపు తర్వాత బుధవారం ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే, ఎక్కడ ఆశాంతి తలెత్తుతుందో అనే భయంతో మంగళవారం ఉదయమే అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో భారీగా మోసం జరిగిందని అధ్యక్షపదవి అభ్యర్థిని సవాల్ చేసిన ప్రబోవో సుబియాంటో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగవచ్చని హెచ్చరించారు. దాంతో మంగళవారం నాడు ఎన్నికల సంఘం కార్యాలయంతో సహా జకార్తా అంతటా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అభినందించిన మోడీ
ఇండోనేసియా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన జోకో విడోడోను భారత ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం అభినందించారు. రెండు దేశాల మధ్య మరింత పటిష్టమైన ద్వైపాక్షిక భాగస్వామ్యంకోసం విడోడోతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని, రెండు దేశాల మధ్య ఏడు దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలున్నాయని మోడీ తెలిపారు.

Joko Widodo re-elected as Indonesia president