Home వార్తలు నగరంలో ఈ నెల 28న జర్నలిస్ట్ గర్జన సభ

నగరంలో ఈ నెల 28న జర్నలిస్ట్ గర్జన సభ

Journalist Gauri Sabha on 28th in hyd

వికారాబాద్ జిల్లా: హైదరాబాద్ నగరంలో ఈ నెల 28వ తేదీన జరిగి జర్నలిస్టుల గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టియుడబ్లుజె రాష్ట్ర కోశాధికారి మహిపాల్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలోని రవీంద్రమండపంలో వికారాబాద్ జిల్లా జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో యూనియన్‌కు సంబంధించి సభ్యత్వ నమోదు, నూతన జిల్లా కమిటీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నేరవేర్చలేదని ఆరోపించారు. దీనికిగాను ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన నిర్వహించే ఛలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల గర్జన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్‌చారి, సలీంపాష, సీనియర్ జర్నలిస్టులు మఠం వైద్యనాథ్, ఆర్‌ఎం గీరీశ్వరస్వామి, దివాకర్‌రెడ్డి, రాఘవేందర్, శ్రీధర్, శివకుమార్, రఘు, వెంకటరమణ, ఆనంద్, వాసు, నర్సింహ్మారెడ్డి, బ్రహ్మం, రామ్‌నరేష్, శ్రీశైలం, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.