Search
Monday 24 September 2018
  • :
  • :

గుర్రంకొండ శ్రీకాంత్ నవలలు విజ్ఞాన సర్వస్వాలు

ARASAM

హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయులు, సోవియట్ ల్యాండ్ నెహ్రు అవార్డు గ్రహీత, సోవియట్ ల్యాండ్ పత్రికా సంపాదకులు, వార్త దినపత్రిక జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ గుర్రంకొండ శ్రీకాంత్ సంస్మరణ సభ ఈ రోజు మఖ్దూంభవన్‌లో డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కందిమళ్ళ ప్రతాపరెడ్డి , విశిష్ట అతిథిగా మల్లెపల్లి ఆదిరెడ్డి, అతిథులుగా డాక్టర్ వి. వీరాచారి, వేల్పుల నారాయణ, డాక్టర్ రాపోలు సుదర్శన్ పాల్గొన్నారు. అధ్యక్షోపన్యాసంలో శ్రీకాంత్ 1973 నుంచి అరసంలో పనిచేస్తున్నట్లుగా 1960ల నుంచి వామపక్ష దృష్టితో వివిధ పత్రికల్లో పనిచేసినట్లుగా వివరించి, తమ మధ్యవున్న స్నేహాన్ని ఏటుకూరి ప్రసాద్ వివరిస్తూ, శ్రీకాంత్ రాసిన నవలలు మదన సదనం, వోల్గా తరంగాలు, దేవుళ్లురా మీ పేరేమిటి ?.  ప్రేమకు కత్తిపోట్లు, మనిషి, గద్దల గుంపు నవలలు రాసినట్లు వారు తెలిపారు.

కందిమళ్ళ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సిపిఐ పట్ల, నిబద్ధతతో జీవితాంతం పనిచేశారని, ‘భాషా-పత్రికా భాషా’ అనే పుస్తకాన్ని జర్నలిస్టులకు పనికొచ్చే విజ్ఞాన సర్వస్వంగా వెలువరించారని కొనియాడారు. ఈ సభలో అనిల్ అట్లూరి, పాలకూరి రాజు, డాక్టర్ సి.హెచ్. బాబావలీ రావులతోపాటు జర్నలిజంలో ఆయన వద్ద శిక్షణ తీసుకున్న శిష్యులు అగస్టీన్, రామారావు, వేదాంతాచార్యులు, కె.వి.యల్. మొదలైన వారు తమతో శ్రీకాంత్‌కున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Journalist GuramKonda Srikanth’s Novels are like science!

Comments

comments