Search
Monday 24 September 2018
  • :
  • :

మధ్యప్రదేశ్‌లో జర్నలిస్టు హత్య

SANDEEP

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఓ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బింద్ పట్టణంలో జరిగింది. జర్నలిస్టు సందీప్ శర్మను ఇసుక మాఫియా లారీతో ఢీకొట్టించి హత్య చేసింది. బైక్‌పై వెళుతున్న సందీప్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సందీప్ అక్కడికక్కడే చనిపోయారు. ఇసుక మాఫియాపై సందీప్ సంచలన వార్తలు రాశారు. దీంతో ఆయనపై కోపం పెంచుకున్న ఇసుక మాఫియా గ్యాంగ్ ఆయన్ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. ఇసుక మాఫియాకు, పోలీసులకు మధ్య ఉన్న సంబంధాలను సందీప్ శోధించారు. తనకు ప్రాణహాని ఉందని గతంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే సందీప్ హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Journalist Murder in Madhya Pradesh

Comments

comments