Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జర్నలిస్టు హత్య

MURDERపాట్నా : ప్రముఖ ప్రాంతీయ దినపత్రికలో పాత్రికేయుడుగా పని చేస్తున్న ఓ వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. అక్రమ స్టోన్ చిప్ యూనిట్లపై కథనాలు రాయడంతో ఆగ్రహించిన వర్గాలే ఆ పాత్రికేయుడిని చంపించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పాత్రికేయుడు ధర్మేంద్రసింగ్ (35) రోడ్డు పక్కన ఉన్న టి స్టాల్‌లో టి తాగుతున్న సమయంలో కొంతమంది దుండగులు సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపారని సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ అలోక్ రంజన్ వెల్లడించారు. పాయింట్ బ్లాంక్ రేంజి నుంచి పొట్ట భాగంలో కాల్చడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ధర్మేంద్రసింగ్‌కు భార్య, కొడుకు ఉన్నారు. రోహతస్ జిల్లాలో చాలా రోజుల నుంచి అక్రమ క్వారీయింగ్ వ్యాపారం జరుగుతోంది. ఇంతకుముందు కూడా ఇదే జిల్లాలోని సివాన్ ప్రాంతంలో రాజ్‌దేవ్ రంజన్ అనే మరో పాత్రికేయుడిని గత మేలో కాల్చి చంపారు.

Comments

comments