Search
Wednesday 21 November 2018
  • :
  • :

సాక్షి విలేకరు పై దాడి

Journalists attacked the attacks
ఇటిక్యాల: మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో అలంపూర్ సాక్షి విలేకరు ఎస్.అనంతరాములు పై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే… ఎర్రవల్లి చౌరస్తాలో కార్లు అద్దెకు నడిపిస్తున్న గొల్ల సుంకన్న అనే వ్యక్తి దౌర్జన్యంతో ఎర్రవల్లిలో కార్లు నడిపే డ్రైవర్లకు మద్యం తాపి వాళ్ళను తీసుకుని వెళ్ళి అనంతరాములు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అనంతరాములు, ఇంట్లో ఉన్న బంధువులను, పెంచికలపాడు గ్రామానికి చెందిన శివకుమార్ పై దాడి చేసి పిడిగుద్దులతో గాయ పర్చి ఇంట్లో ఉన్న వాళ్ళని అసభ్య పదాలతో శోధించారు. ఇందుకు విలేకరులు అంతా ఏకమై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇటిక్యాల మండల టీ యు డబ్యూ జే సంఘం నాయకులు రాముడు, సురేష్, రామన్ గౌడ్, క్రిష్ణ డిమాండ్ చేశారు. సాక్షి విలుకరు అనంతరాములు పై దాడిని ఖండిస్తూ జిల్లా ఎస్పి శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్‌కు టియూడబ్లూ జే జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ధరూర్ శ్యామ్, విలేకరుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. సాక్షి విలేకరు అనంతరాములుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇటిక్యాల మండల విలేకరులు కూడా తహశీల్దారు కార్యాలయం, పోలీస్ స్టేషన్‌లో ఆర్‌ఐ, ఎస్ఐలకు వినతిపత్రం అందజేశారు.

Comments

comments