Home వరంగల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

Journalistsమనతెలంగాణ/ హన్మకొండ : జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(ఐజెయు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్‌ఓ శోభకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈసందర్బంగా ఐజెయు నాయకులు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతి రమేష్, జిల్లా కన్వీనర్ తుమ్మ శ్రీధర్‌రెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ టియుడబ్లూజే ఆధ్వర్యంలో గతంలో ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించా మని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం అనుస రిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా గత కొన్ని రోజులుగా టియుడబ్లూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగు తుందన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టుల సమస్య లు పరిష్కారించాలని లేని పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు కంకణాల సంతోష్, ఎం. సుధాకర్‌రావు, నంభూద్రీపాద్, గాడిపల్లి మధు, జి.విద్యాసాగర్, దూలం శ్రీనివాస్, ఎన్.బుచ్చిరెడ్డి, దుర్గాప్రసాద్, బి.సునీల్‌రెడ్డి, బి.అమర్. దొమ్మటి శ్రీకాంత్, రాంచందర్, అభిలాష్, పర్వతాలు, ఎ. లక్ష్మణ్, సిహెచ్.రామకృష్ణ, నరేష్, కత్తిరాజు, ప్రసాద్, గండి సీతారాం, అరుణ్‌కుమార్, కె.శ్రీనివాస్, బి.అశోక్, జి.రామారావు, ఎస్. యం. సయ్యద్, బి.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.