Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

తారక్ రెండో కుమారుడి పేరేంటో తెలుసా?

Jr. NTR annouce his Second Son name through Twitter

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ సతీమణి లక్ష్మీప్రణతి గత నెల 14న మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ బాబు ఫోటోను తారక్ తన ట్విట్టర్ ఖాతా అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా చిన్నారి పేరును ట్వీట్ చేశాడు. తన రెండో తనయుడికి భార్గవ రామ్‌ అని నామకరణం చేశామని ట్వీట్ చేశాడు. కాగా, ఈ దంపతులకు మొదటి సంతానంగా అభయ్ రామ్‌ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత మూవీతో బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రానున్న మల్టీస్టారర్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి నంటించనున్నాడు.

Comments

comments