Search
Sunday 23 September 2018
  • :
  • :

సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ సినిమా

Ntr-Pathఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్‌లో బివిఎన్‌ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “ప్రస్తుతం లండన్‌లో సెప్టెంబర్ 20 వరకు జరిగే షెడ్యూల్‌తో సినిమా చివరి దశకు వస్తుంది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే 20 రోజుల షెడ్యూల్‌తో దాదాపుగా సినిమా పూర్తవుతుంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా సినిమాని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం. ఎన్టీఆర్ కెరీర్‌కి, మా బ్యానర్‌కి ఇది ప్రతిష్టాత్మక చిత్రమవుతుంది. సుకుమార్ ఎక్స్‌ట్రార్డినరీగా సినిమా తీస్తున్నాడు”అని అన్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తాడు. సినిమాలో అత్యంత ఖరీదైన బైక్‌ని ఉపయోగిస్తున్నాం. లుక్, కాస్టూమ్స్ పరంగా స్టైలిష్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు”అని చెప్పారు. ఎన్టీఆర్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌లతో పాటు మరికొంతమంది భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతంః దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీః విజయ్ కె.చక్రవర్తి, ఫైట్స్‌ః పీటర్ హెయిన్స్.

Comments

comments