Search
Sunday 23 September 2018
  • :
  • :

జడ్జి అరెస్టు

Judge Satyanarayana Arrest

మన తెలంగాణ / హైదరాబాద్/ ముషీరాబాద్: చట్టాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తే కీచకుడుగా మారాడు. ఓ మహిళా న్యాయవాదిని ప్రేమ పేరుతో మోసం చేసాడు తుంగతుర్తి సెషన్స్ కోర్టు జడ్జి సత్యనారాయణ. దీంతో ఈ నెల 4న బాధితురాలు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సత్యనారాయణపై చిక్కడపల్లి పోలీసు లు ఐపిఎస్ సెక్షన్ 376, 379 కింద రేప్ (అత్యాచారం), ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు చేసి, హై కోర్టు అనుమతితో సత్యనారాయణను మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలు చిక్కడపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.. దోమలగూడకు చెందిన ఓ మహిళా న్యాయవాదిని తుంగతుర్తి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు.  ఈ క్రమంలో ఆమెను లైంగికంగా వేధించాడు.  ఈ మేరకు బాధితురాలు  ఈ నెల 4వ తేదీన చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఆరోపణలపై ప్రాథమిక సాక్షాధారాలను సేకరించి వాటిని ధృవీకరించుకున్న పోలీసులు విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు అనుమతి మేరకు జడ్జీ సత్యనారాయణను చిక్కడపల్లి పోలీసులు తుంగతుర్తికి వెళ్లి సత్యనారాయణ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసారు.

Comments

comments