Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘జూలీ గణపతి’లోని సీన్లను కాపీ కొట్టారు : కూనిరెడ్డి

Kunireddy-srinivasప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తమిళంలో సూపర్‌హిట్ అయిన జూలీ గణపతి మూవీ తమిళ్ డబ్బింగ్, రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకుడు. ఈ చిత్రంలో జయరామ్, సరిత హీరోహీరోయిన్లుగా నటించారు. కానీ తన అనుమతి లేకుండా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ‘చారుశీల’ చిత్రంలో కాపీ కొట్టారని నిర్మాత కూని రెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ‘జూలీ గణపతి మూవీని స్టార్ ఆర్టిస్టులతో రీమేక్ చేయాలని ఇంతకాలం ఆగాను. అయితే చిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా ఉన్న కొందరు ఈ చిత్రం కథను చౌర్యం చేశారు. జూలీ గణపతి చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ‘చారుశీల’లో కాపీ కొట్టారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శక నిర్మాతలకు ఆధారాలతో తెలపగా వారు నిర్లక్ష ధోరణిని ప్రదర్శించారు. దీంతో చివరికి కోర్టును ఆశ్రయించాను. ఇక జూలీ గణపతి చిత్రాన్ని రీమేక్ చేయాలని ‘శూర్పణక’ అనే టైటిల్‌ను సైతం రిజిస్టర్ చేయించాను. ఇప్పుడు ‘చారుశీల’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. బయ్యర్లకు సినిమాలో జరిగిన కాపీ విషయాన్ని తెలియజేస్తున్నాను”అని అన్నారు.

Comments

comments