Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రేషన్ సరుకులు అందిస్తాం

July 5th Distribute Ration Things In Telangana

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి ఆటంకం కలుగకుం డా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ నెల 5వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు, పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో సకాలంలో రేషన్ సరుకులు అందిస్తామని, ఇట్టి విషయంలో లబ్దిదారులు ఎవరు ఆందోళన చెందవద్దని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం ప్రజా పంపిణీపై ఆయన స్పందిస్తూ… రేషన్ డీలర్లు సమ్మె విషయంలో మొండిగా వ్యవహరించి పేదలకు ఇబ్బందులు కలుగజేయకుండా వెంటనే సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేశామని, ఈ విషయంలో రేషన్ డీలర్లతో పలుమార్లు రాష్ట్ర స్థాయి సమావేశం కూడా నిర్వహించడం జరిగిందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ముగ్గు రు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ కమిటీలో డీలర్లను కూడా భాగస్వామ్యులను చేసినప్పటికీ వారి వైఖరిలో ఏ మాత్రం మార్పు రాకపోవడం పట్ల సరుకు ల పంపిణీలో డీలర్లు బాధ్యతను విస్మరిస్తున్నారన్నారు. పేదల ఆహార భద్రతకు ఆటంకం కలిగించేలా డీలర్ల వ్యవహార శైలీ పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఇది మాత్రం సరైన చర్య కాదన్నారు. ప్రజా పంపిణీలో జాప్యం జరుగకూడదనే ఉద్దేశ్యంతో మహిళా సంఘాలు, మెప్మాల ఆధ్వర్యంలో పేదలకు సకాలంలో రేషన్ అందజేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందు లో భాగంగానే ప్రత్యామ్నయంగా గ్రామీణ ప్రాంతాల్లో 499 మహిళా సంఘాలను, పట్టణ ప్రాంతాల్లో 20 మెప్మా సంఘాలను గుర్తించడం జరిగిందన్నారు. సరుకుల  నిల్వకు, పంపిణీ చేసేందుకు ఇప్పటికే 46 ఐకెపి సెంటర్లు గుర్తించడంతో పాటు 417 గ్రామ పంచాయతీలు, 10 కమ్యూనిటీ భవనాలతో సహా 46 ఇతర భవనాలను కూడా గుర్తించడం జరిగిందన్నారు. ఈ నెల 5 నుండి 10వ తేదీ వరకు సూచించిన ప్రాంతా ల్లో సరుకుల పంపిణీ చేపడుతామని, అవసరమైన చోట స్థానిక పరిస్థితులను బట్టి గడువును పొడగిస్తామని తెలిపారు. అంతేకాకుండా రేషన్ సరుకలను ఎక్కడ నుండి పంపిణీ చేస్తామనే విషయాన్ని కూడా ప్రతి గ్రామంలోని లబ్దిదారులకు ముందస్తు సమాచారాన్ని తెలియజేస్తామన్నారు. ప్రజ లు సరుకులు అందవనే ఆందోళనకు గురికావద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందించేందుకు జిల్లా యాంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ఎక్కడ కూడా సరుకులు అందలేవనే ఫిర్యాదులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా లబ్దిదారులకు సకాలంలో సరుకులు అందక లేదా పంపిణీ విషయంలో ఇతర ఇబ్బందులు ఎదురైనచో 9985390891 నెంబర్‌కు ఫోన్ గానీ 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు గానీ లేదా 7330774444 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ జిల్లాలోని లబ్దిదారులకు సూచించారు.

Comments

comments