Home తాజా వార్తలు ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్…?

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్…?

Junior NTR in NTR Biopic

సినిమా: దివంగత మాజీ సిఎం, ప్రముఖ నడుటు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రెండు భాగాలుగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు’ అనే టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సిన్మాలో నటిస్తున్న పలువురు స్టార్స్ పేర్లు, వారి ఫస్ట్ లుక్ లు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో ఎన్ టిఆర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. మరి బాలయ్య పాత్రను ఎవరు పోషించనున్నారు..? అని నందమూరి అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్న అంశం.

గతంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ పాత్రను పోషిస్తాడని ఫిలింనగర్ లో జోరుగా వార్తలు వినిపించాయి. కాగా, ఇప్పుడు మరో సంచలన వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అదే బాలయ్య పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేయనున్నాడట. త్వరలోనే జూనియర్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయనున్నారని టాక్. ఈ విషయాన్నిఅధికారికంగా చిత్ర బృదం ఇంకా వెల్లడించలేదు.

Junior NTR in NTR Biopic

telangana latest news