Home తాజా వార్తలు మరోసారి కెసిఆర్ ను సిఎం చేయాలి: మంత్రి జూపల్లి

మరోసారి కెసిఆర్ ను సిఎం చేయాలి: మంత్రి జూపల్లి

Jupalli KrishnaRao Speech About Kcr In Meeting

నాగర్ కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్ పట్టణంలో టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు.  పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, రైతు సమగ్ర సర్వే, 24 గంటల కరెంట్,మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం లాంటి దేశానికి ఆదర్శమయ్యే పథకాలను అమలు చేశారన్నారు. అందుకే రైతు బంధువు కెసిఆర్‌ను మరోసారి సిఎం చేయాలని మంత్రి జూపల్లి పార్టీ కార్యకర్తలను కొరారు.