Home నాగర్ కర్నూల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జూపల్లి అరుణ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జూపల్లి అరుణ్

MONEY

పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని మారేడ్ మాన్‌దిన్నే గ్రామంలో గత వారం రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన లలిత(45) కుటుంబ సభ్యులను జూపల్లి అరుణ్ పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి ఈ సందర్భంగా జూపల్లి అరుణ్ 5వేల ఆర్థిక సాయం అందించారు. చంద్రబండ తాండలో జూపల్లి అరుణ్ పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతులు బిటీ రోడ్డు నిర్మాణం మారేడు మాన్ దిన్నే నుండి చంద్ర బండ తాండకు వరకు చేపట్టాలని కోరారు. సిసి రోడ్లు, తాగునీటి గురించి గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్య త్వరతగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేశ్వర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు విష్ణు, టిఆర్‌ఎన్ నాయకులుబాలు నాయక్, శ్రీహరి రావు, వెంకటస్వామి గౌడ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.