Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అప్రజాస్వామికం అంటే కాంగ్రెస్‌కు అర్థం తెలుసా?..

Jupally-Krishna-Rao

హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఎన్నికలంటే భయం పట్టుకుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం జూపల్లి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాలన మీద ప్రజలకు నమ్మకం ఉందని, అమరవీరుల కుటుంబాలను సిఎం కెసిఆర్ ఆదుకున్నారని పేర్కొన్నారు. అప్రజాస్వామికం అంటే ఏంటో కాంగ్రెస్‌కు అర్థం తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లీడర్లకు అధికారం, పదవులు, సంపద తప్ప మరో యావలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు.

Comments

comments