Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

స్థానిక సంస్థల బలోపేతానికి కృషి…

Jupally Krishna rao says Panchayat elections will complete within time

హైదరాబాద్ : సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్‌లతో జిల్లా పరిషత్‌ల చైర్‌పర్సన్లు బుధవారం భేటీ అయ్యారు. నాలుగేండ్ల పదవీకాలం పూర్తి చేసుకున్ననేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్లను మంత్రికి అభినందనలు తెలియజేశారు. జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయించాలని జూపల్లి కృష్ణారావుకి  చైర్‌పర్సన్లు వినతి పత్రాన్నిఅందించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇందులోభాగంగానే కొత్త పంచాయతీ రాజ్ చట్టానికి కూడా రూపకల్పన చేశామని వెల్లడించారు. నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని జూపల్లి స్పష్టం చేశారు.

Comments

comments