Search
Friday 21 September 2018
  • :
  • :

గ్రామీణాభివృద్ధే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Jupally-Krishna-rao

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని  రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వాటి కోసం ప్రభుత్వం రూ.1200 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ సమావేశమందిరంలో స్వచ్ఛ భార త్ గ్రామీణ మీషన్ గ్రామ పంచాయతీ  ప్రోత్సాహక పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించిదని, వాటిని ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. నిధులను గ్రామ పంచాయతీ ప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలను మండల పరిధిలోని చందుబట్ల , కొల్లాపూర్ మండలం సింగోటం, మాచినేనిపల్లి గ్రామాలకు ప్రోత్సాహకం  కింద రూ. 5 చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో  డిపిఒ సుధా కర్, ఎంపిడిఒ పండరినాథ్, ఇఒపిఆర్‌డి కోటేశ్వర్,  ఎంపిపి శాంతమ్మ, జిల్లా గ్రామ పంచా యతీ సర్పంచ్, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments