Search
Saturday 22 September 2018
  • :
  • :

మంత్రి జూపల్లి దిష్టిబొమ్మ దహనం

Effigy

సిర్పూర్(యు): రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణ రావ్ దిష్టిబొమ్మను ఆదివారం మండల కేంద్రంలో ఐకేపీ వీఓఏలు దహనం చేశారు. నెలల తరబడి ఐకేపీ వీఏఓలు అనేక కష్టా నష్టలు ఎదుర్కోంటున్నప్పటికి అండగా నిలవల్సిన మంత్రి తమను కించపర్చడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఐకేపీ వీఓఏల మండల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులు తొడసం మారుతి, ఉపాధ్యక్షులు జగ్‌నక జానక్‌రావ్, కార్యదర్శి ఆత్రం హన్మంత్ రావ్, సోయం జుగాజీరావ్, గేడాం శంకర్‌లు హజరై ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.  మంత్రి వ్యాఖ్యలకు నిరసనగానే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు మద్దతు పలికారు.

Comments

comments