Search
Friday 21 September 2018
  • :
  • :

జూరాలకు ఒక్క టిఎంసి

congress-partyఈ సీజన్‌లోనే ఆర్‌డిఎస్ పనులు , రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలకు కర్నాటక సిఎం హామీ
హైదరాబాద్:రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్‌డిఎస్) ప్రాజెక్టు పెండింగ్ పనులు ఈ సీజన్‌లోనే చేపడడుతామని, అలాగే పాలమూరు జిల్లా తాగు నీటి అవసరా ల కు నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల కు ఒక్క టిఎంసి నీటిని విడుదల చేస్తామని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీని చ్చారు. ఆర్‌డిఎస్ పనులు, కృష్ణా జలాల విడుదల గురించి చర్చించేందుకు టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుధవారం బెంగుళూరుకు వెళ్ళి కర్నాటక ముఖ్యమంత్రిని ఆయన అధికార నివాసంలో భేటీ అయింది. కాంగ్రెస్ ప్రతినిధి బృందంలో సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, మండలి విపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్, ఎంఎల్‌సి పొం గు లేటి సుధాకర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు డి.కె. అరుణ, వం శీచంద్‌రెడ్డి, మహబూబ్‌నగర్ డిసిసి అధ్యక్షులు ఒబేదుల్లా, టిపిసిసి ప్రధాన కార్యదరిశ వేణుగోపాల్, కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, ఆలంపూర్ ఎంఎల్‌ఎ ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లు సిద్ధరామయ్యకు ఆర్‌డి ఎస్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించి, సమస్యను వివరించారు. ఆర్‌డిఎస్ కింద ప్యాకేజీ 1,2 పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆనకట్టను 6 ఇంచులు పెంచి నిర్మించడంతో పాటు కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలని వారు కోరారు. తద్వారా మహబూబ్‌నగర్ జిల్లా లో 84 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని వివరిం చారు. వాస్తవానికి 15.9 టిఎంసిల నీరు పాల మూ రుకు అందాలని, అయితే అంత నీరు అందక వెనుకబడిన జిల్లాకు నష్టం జరుగుతుందని చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ఈ సీజన్‌లోనే ఆర్‌డిఎస్ ఆనకట్ట పనులు, కాలువ ఆధునీకరణ చేపడు తా మని తెలిపారు. అలాగే నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు మూడు టిఎంసిల నీటిని విడుదల చేయమని కోర గా, ఒక్క టిఎంసి వదిలేందుకు ఆయన అంగీ కరించారు. అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశా రు. గతంలో తనను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి కలిశారని, ఆర్‌డిఎస్ పనుల వ్యయం రూ.52 కోట్లు పెరిగినందున, ఆ మోత్తాన్ని డిపాజిట్ చేయా లన్నా మని, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు.

Comments

comments