Search
Monday 24 September 2018
  • :
  • :

జీనోమ్‌కు మరింత ఠీవి

సమగ్ర మాస్టర్ ప్లాన్ బాధ్యతలను అప్పగిస్తూ సుర్భానా జురాంగ్ సంస్థతో అవగాహన ఒప్పందం 

KTRహైదరాబాద్: జీనోమ్ వ్యాలీని మరింతగా అభివృద్ధి చేసేలా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ బాధ్యతలను సుర్భానా జురాంగ్ సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖమంత్రి కెటి. రామా రావు సమక్షంలో ఎంయు పత్రాలపై సుర్భానా జురాంగ్ కన్సల్టెంట్స్ కంట్రీహెడ్ నిరూప్ జయం త్, రాష్ట్ర పరిశ్రమలు ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సంతకాలు చేశారు. ఈ ఎంఒ యును పురస్కరించుకుని జయేష్ రంజన్ మాట్లా డుతూ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సెన్స్ క్లస్టర్‌గా విస్తరిస్తోందన్నారు. 200 కంపెనీలు, 10 వేల మంది ఉద్యోగులతో ఈ జీనోమ్ వ్యాలీ తన కార్యకలాపాలను కొన సాగిస్తోందని, తాజాగా కుదుర్చుకున్న ఎంఒయు ప్రకారం ప్రపంచ స్థాయి క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ 2.0 మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయనున్నామని తెలి పారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలైతే ప్రస్తుతం ఉన్న కంపెనీలు విస్తరణ ప్రణాళికలను ప్రకటించే వీలుండడంతో పాటు ఇందులోకి కొత్త వారు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. జీనోమ్ వ్యాలీ క్లస్టర్‌లో ఇప్పటికే ఉన్న గ్లాక్సో స్మిత్ క్లీన్, మైలాన్, డుపాంట్, యుఎస్ ఫార్మకోఫియా, నోవార్టీస్ వంటి సంస్థలు మరిన్ని పెట్టుబడులకు సిద్ధం అవుతాయని అంచనా వేస్తున్నట్లు జయేష్ రంజన్ వెల్లడించారు.

Comments

comments