మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రతిష్టాత్మకమైన ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భారత్ మూడు ట్వంటీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అంతేగాక ఐదు టెస్టుల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ముందుగా జరిగిన టి20 సిరీస్‌ను భారత్ 21తో సొంతం చేసుకుంది. చివరి వన్డేలో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం టీమిండియా అలవోకగా ఛేదించింది. రెండో టి20లో ఓడినా మళ్లీ ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. కిందటిసారి ఇంగ్లండ్ గడ్డపై అవమానకర రీతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. గతంతో పోల్చితే ఈసారి భారత్ చాలా బలంగా ఉంది. విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ బలమైన జట్టుగా ఎదిగింది. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా వరుస విజయాలు సాధిస్తోంది. కొంత కాలం క్రితం జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా భారత్ మెరుగైన ప్రతిభను కనబరిచింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో కూడా సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను గెలిచి తనకు ఎదురులేదని నిరూపించింది. చివరి టి20లో ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకంతో చెలరేగి పోయాడు. చాలా కాలం తర్వాత రోహిత్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడిన రోహిత్ మెరుపు సెంచరీ సాధించాడు. అతని విజృంభణతో భారీ లక్ష్యాన్ని సైతం టీమిండియా అలవోకగా సాధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్‌షోతో చెలరేగడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. చాలా రోజుల తర్వాత పాండ్య ఇటు బంతితో అటు బ్యాట్‌తో రాణిస్తున్నాడు. రానున్న మ్యాచ్‌లలో అతను ఇదే జోరును కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. లోకేష్ రాహుల్ కూడా తొలి టి20లో శతకంతో సత్తా చాటాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడిన రాహుల్ భారత్‌కు తొలి మ్యాచ్‌లో ఘన విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అంతేగాక కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఫాంలోకి రావడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. తొలి మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి తర్వాతి మ్యాచుల్లో బాగానే ఆడాడు. రెండో టి20లో సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనాలు రాణించడం భారత్‌కు కలిసి వచ్చే అంశాలే. అయితే స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ వైఫల్యం భారత్‌ను కలవర పెడుతోంది. రానున్న వన్డే సిరీస్‌లోనైనా ధావన్ మెరుగైన బ్యాటింగ్ కనబరచాల్సి ఉంటుంది. ధావన్ విఫలమైతే భారత్‌కు కష్టాలు ఖాయమని చెప్పాలి. అంతేగాక చాహల్, కుల్దీప్లు కూడా నిలకడగా బౌలింగ్ చేయక తప్పదు. ఏదీ ఏమైన ఈ సిరీస్‌లో టీమిండియా ప్రకంపనలు సృష్టించడం మాత్రం ఖాయమని చెప్పాలి. ఇప్పటికే టి20 సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది.
టి20 ర్యాంకింగ్స్
రాహుల్ @ 3
దుబాయి: భారత స్టార్ ఆటగాడు లోకేష్ రా హుల్ ఐసిసి ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలకడగా రాణించడంతో రాహుల్ తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. సోమవారం ఐసిసి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రాహుల్ మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. రాహుల్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో రాహుల్ అజేయ శతకంతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఆఖరి మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. తా జా ర్యాంకింగ్స్‌లో రోహిత్ 11వ స్థానానికి చేరుకున్నాడు. కిందటిసారి రోహిత్ 13వ స్థానంలో ఉన్నాడు. కాగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం నిరాశ పరిచాడు. నాలుగు ర్యాంక్‌లు పడిపోయి 12వ స్థానంలో నిలిచాడు. కాగా, ఆ స్ట్రేలియా ఓపెనర్ అరొన్ ఫించ్ టాప్ ర్యాంక్ ను ఒంతం చేసుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది.