Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

దర్శకేంద్రుడి యూట్యూబ్ పాఠాలు

Raghavendraహైదరాబాద్ : ప్రసిద్ధ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంపై ఆసక్తి ఉన్న వారికి కేఆర్‌ఆర్ అనే పేరుతో యూట్యూబ్ పాఠాలు చెప్పనున్నారు. ఈ పాఠాల్లో రెగ్యులర్ ఫిల్మ్ స్కూల్‌లో మాదిరిగా సిలబస్ ఉండదని ఆయన తెలిపారు. తన వంద చిత్రాల ప్రయాణంలో ఓ సీన్ తీసినా, పాట తీసినా, తాను తీసుకున్న జాగ్రత్తలను ఈ పాఠాల్లో ఆయన వివరించనున్నారు. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు తన ఫేస్‌బుక ఖాతా ద్వారా తెలిపారు. ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే కేఆర్‌ఆర్ పాఠాలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

Comments

comments