Search
Wednesday 18 July 2018
  • :
  • :

‘కాలా’ ఆడియో విడుదల

Kaala audio was launched online on Wednesday

చెన్నై: ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కథనాయకుడిగా కబాలి డైరెక్టర్ పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ‘కాలా’. ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ్ బాణీలు అందించారు. కొద్దిసేపటి క్రితం మూవీ ఆడియోను చిత్ర బృందం యూ ట్యూబ్ ద్వారా విడుద‌ల చేసింది. కాలా ఆడియో ఆల్బమ్ లో మొత్తం 8 పాట‌లు ఉన్నాయి. సంతోష్ నారాయ‌ణ్ సమకూర్చిన స్వరాలు వినసొంపుగా ఉన్నాయి. కాలాలో రజినీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రల్లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, అంజలి పాటిల్, దిలీపన్ నటిస్తున్నారు. సినిమాను రజినీ అల్లుడు ధనుష్ ‘వండ‌ర్ బార్ ఫిలింస్ బ్యానర్’పై నిర్మిస్తున్నాడు. చెన్నైలోని వైఎమ్‌సిఎ నంద‌నంలో బుధవారం సాయంత్రం గ్రాండ్ గా ఆడియో వేడుక జ‌రుగనుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం జూన్‌ 7న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల కానుంది.

Comments

comments