Home సినిమా వీడియోలు ‘కాలా’ ట్రైలర్ వచ్చేసింది..!

‘కాలా’ ట్రైలర్ వచ్చేసింది..!

Kaala Official Trailer Released

చెన్నై: ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కథనాయకుడిగా కబాలి డైరెక్టర్ పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ‘కాలా’. తాజాగా కాలా తెలుగు ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో రజినీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సంతోష్ నారాయ‌ణ్ స్వరాలు అందించారు. ఇతర ప్రధాన పాత్రల్లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, అంజలి పాటిల్, దిలీపన్ నటిస్తున్నారు. సినిమాను రజినీ అల్లుడు ధనుష్ ‘వండ‌ర్ బార్ ఫిలింస్ బ్యానర్’పై నిర్మిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం జూన్‌ 7న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల కానుంది.