Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కార్తీ, అదితిలు మణిరత్నంను అధిగమించేశారు

Cheliyaa-Audio-Launch

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యా నర్‌పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం ‘చెలియా’. కార్తీ, అదితిరావ్ హైదరీ జంటగా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకుడు. ఈ చిత్రం పాటల విడుద ల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమం లో మణిరత్నం, ఎ.ఆర్.రెహమాన్, సీతారామశాస్త్రి, వంశీ పైడిపల్లి, సుహాసిని, కార్తీ, అదితిరావ్ హైదరీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆడియో సీడీలను సీతారామ శాస్త్రి విడుదల చేసి తొలి సీడీని ఎ.ఆర్.రెహమాన్‌కు అంద జేశారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముం దుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మణిరత్నం మాట్లాడుతూ “ఈ సినిమాను ఏర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాను. రెగ్యులర్‌గా కనపడే కార్తీ ఇందులో కనిపించడు. అలాగే అందమైన అదితిరావ్ హైదరీ అతనికి జంటగా అద్భుతంగా  నటించింది. ఈ సిని మా పాటలు తెలుగులో ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం ఎ.ఆర్.రెహమాన్, సీతారామశాస్త్రి. వారికి స్పెషల్ థాంక్స్. ఈ చిత్రాన్ని దిల్‌రాజు బ్యానర్‌లో రిలీజ్ చేస్తుండ డంతో విజయంపై మా నమ్మకం పెరుగుతోంది”అని అన్నారు. సుహాసిని మాట్లాడుతూ “మణిరత్నం సినిమాలకు నేనే బెస్ట్ క్రిటిక్‌ను. నీకు రాయడం వచ్చా అని ఆయన్ని విమ ర్శిస్తూ ఉంటాను. నేను విమర్శించినా ప్రేక్షకులు ఆయన సినిమాలను ఆదరిస్తుంటారు. మరోసారి ఈ చిత్రంతో మణిరత్నం లవ్‌స్టోరీని డైరెక్ట్ చేశారు. తన సినిమాల్లోని క్యారెక్టర్స్‌ను ఆయన డామినేట్ చేస్తుంటారు. కానీ ఈ సిని మాలో కార్తీ, అదితిరావ్‌లు మణిరత్నంను అధిగమించేశారు. అదితి చాలా చక్కగా నటించింది. నా ఇన్నేళ్ల అనుభవంలో అదితి అంత అందంగా నటించే హీరోయిన్‌ను చూడలే దు”అని చెప్పారు. ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ “మణిర త్నం నా సోదరుడు, స్నేహితుడు. మా ఇద్దరికీ 25 ఏళ్ల ప్రయాణం. తెలుగు పాటలంటే నాకు చాలా ఇష్టం. భాష లోని గొప్పతనమే అందుకు కారణమేమోననిపిస్తుంది. ఇక బాహుబలితో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి చేరు కుంది”అని తెలిపారు. కార్తీ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ముందు కథ వినగానే అన్నయ్య సూర్యలాంటి నటుడు చేయాల్సిన క్యారెక్టర్ ఇదని మణిరత్నంకు చెప్పాను. సినిమాలో నాది ఫైటర్ పైలెట్ క్యారెక్టర్. ఈ సినిమాలో నటించడం డిఫరెంట్ జర్నీ. రెండు బలమైన పాత్రల మధ్య జరిగే కథ ఇది. రెహమాన్ మ్యూజిక్ విన్నప్పుడల్లా ఓ శక్తి వస్తుంటుంది. ఆయన మ్యూజిక్‌లో నేను నటించడం హ్యాపీ గా ఉంది’ అని అన్నారు. అదితి మాట్లాడుతూ “ఇది నాకొక స్పెషల్ మూవీ. ఈ సినిమాతో నా కల నెరవేరినట్టుగా అని పిస్తుంది. చెలియా నా తొలి తెలుగు సినిమా. మణిరత్నం, ఎ.ఆర్.రెహ మాన్‌తో పని చేయడం మరచి పోలేని అనుభూతి”అని చెప్పారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు దిల్ రాజు సతీమణి అనిత మృతికి సంతాపాన్ని తెలియజేశారు.

Comments

comments