Home తాజా వార్తలు జెట్ స్పీడుతో ‘కబాలి’

జెట్ స్పీడుతో ‘కబాలి’

kabaliసౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ రంజిత్‌తో ‘కబాలి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగు తోంది. సెప్టెంబర్ 17న వినాయక చవితికి ప్రారంభమైన ఈ చిత్రాన్ని కేవలం మూడు నెలల్లో పూర్తి చేసేందుకు డైరెక్టర్ రంజిత్ పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. దానికి రజనీ సహకారం కూడా తోడవ్వడంతో ఈ చిత్రం షూటింగ్ మొత్తం డిసెంబర్ నాటికి పూర్తికావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి షెడ్యూల్ చెన్నైలో జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రస్తుతం మలే సియాలో జరుగుతోంది. అక్కడే 25 రోజుల పాటు షూటింగ్ జరుగనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌కు ముందే రజనీకాంత్‌తో సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల చేత రిహార్సల్స్ చే యించి దర్శకుడు ఇంత స్పీడుగా షూ టింగ్ పూర్తిచేస్తున్నాడు. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమాను పూర్తిచేసి శంకర్ ‘రోబో 2’ సినిమా షూటిం గ్‌లో పాల్గొనాలని రజనీ భావిస్తు న్నాడు. ‘కబాలి’ని ఏప్రిల్ 14న విడుదల చేయా లని భావించారు. కానీ షూటింగ్ జరు గుతున్న తీరు చూస్తుంటే తొందరగా విడుదల య్యే అవకాశాలు ఉన్నాయని కోలీ వుడ్ వర్గాలు భావిస్తున్నాయి.