Home తాజా వార్తలు ‘కబాలి’ని పైరసీ కాటేయనుందా..?

‘కబాలి’ని పైరసీ కాటేయనుందా..?

Kabali-Piracyచెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కబాలి విడుదలకు సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఓ సమస్య ఆ చిత్ర బృందాన్ని కలవరపెడుతుంది. తాజాగా బాలీవుడ్ చిత్రాలు ‘ఉడ్తా పంజాబ్’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ విడుదలకు ముందే ఆన్‌లైన్ మార్కెట్‌లో లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ‘కబాలి’ని కూడా పైరసీ మహమ్మారి కాటేబోతున్నట్లు సమచారం. ఈ మేరకు ఆ చిత్ర బృందం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. రజనీ అభిమానులు, చిత్ర బృందం కలిసి దాదాపు పలు వెబ్‌సైట్లపై నిఘా ఉంచారు. పైరసీకి చిరునామాగా మారిన పలు అనుమతి లేని వైబ్‌సైట్లను నిషేధించాలని మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు 225 వెబ్‌సైట్లను స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలైపులి థాను నిర్మాణంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.