Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కుప్తి ఆయకట్టు నిర్ధారణ

Construction of the project on the Kadam River

మన తెలంగాణ/హైదరాబాద్: కుప్తి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆయకట్టును ప్రతిపాదించింది. 16,500  ఎకరాల ఆయకట్టుకు నీరు అం దించేలా కుప్తి రూపకల్పనలో మార్పుచేర్పులు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  తొలుత కడెం రిజర్వాయర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కుప్తిని తెరపైకి తెచ్చారు. ఇందుకోసం రూ.794.33 కోట్ల అంచనాతో 5.3 టిఎంసిలు నిల్వ చేసేలా బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇదివరకే అంగీకరించింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్తి గ్రామంలో కడెం నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. అయితే కడెం రిజర్వాయర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని తొలుత భావించారు. కానీ స్థానికుల ఒత్తిడి, ముంపు బాధితుల సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా కొంత ఆయకట్టుకు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు.  సుమారుగా 16,500 ఎకరాలకు నీరిచ్చేలా ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇదే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదానికి పంపించారు. ముందస్తు ఎన్నికలు, ప్రభుత్వ రద్దు ఊహాగానాల నేపధ్యంలో కుప్తి రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు నీరివ్వడానికి ప్రతిపాదనలు కేబినెట్‌కు చేరడం గమనార్హం.

Comments

comments