Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కడెం ప్రాజెక్టు సందర్శన

projectకడెం: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నా యని రెండో పంటకు నీరందించేందుకు కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కడెం జలా శయం పూర్తి స్థాయిలో నిండిపోయి వరద గేట్లను ఎత్తివేయడంతో కుటుంబ సభ్యులతో కలిసి కడెం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ నూరొద్దీన్‌లతో కలిసి ప్రాజెక్టు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నీటిని అదుపు చేస్తూ రెండో పంటకు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ ఏడు వర్షాలు పుష్కలంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతం అయ్యిందన్నారు. చెరువులు జలకళను సంత రించుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు నాయ కులు రాంకిషన్ రెడ్డి, సత్యనారాయణ, కడెం తహసీల్దార్ నర్సయ్య, ఎంపీడీఓ శ్రీలత తదితరులున్నారు.

Comments

comments