Home తాజా వార్తలు మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించిన కడియం

మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించిన కడియం

kadiam-park

వరంగల్ రూరల్: జిల్లాలోని సంగెం మండలంలోని చింతపల్లి, గీసుకొండ మండలంలోని శాయంపేట గ్రామాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించనుంది.  ఈ మేరకు అక్టోబర్ 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నపార్కు స్థలాన్ని బుధవారం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి సందర్శించారు.ఈ సందర్భంగా సభావేదిక, పైలాన్, పార్కింగ్ నిర్మాణాలు, తదితర ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ సుధీర్ బాబు, వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

Kadiam shrihari visit to the mega textile park