Home తాజా వార్తలు రోహిణి అస్పత్రి ఘటనపై స్పందించిన:కడియం

రోహిణి అస్పత్రి ఘటనపై స్పందించిన:కడియం

kadiam

వరంగల్: హన్మకొండలోని రోహిణి అసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. రోగులకు అవసరమైన భద్రతను కల్పించాలని కలెక్టర్, సిపీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కడియం పేర్కొన్నారు. రోగుల బంధువులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కడియం శ్రీహరి చెప్పారు. ఆస్పత్రిలోని రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా తరలిస్తున్నామని సీపీ సుధీర్ బాబు చెప్పారు.

kadiam taiking on Rohini Hospital incident