Search
Monday 24 September 2018
  • :
  • :

చిల్లర మాటలొద్దు : కడియం

Kadiyam Comments on Congress

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న తమకు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. 2019లో తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని, వారి కలలు ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరవని ఆయన పేర్కొన్నారు. తిరిగి తామే అధికారంలోకి వస్తామని కడియం ధీమా వ్యక్తం చేశారు. చిల్లర మాటలు మాట్లాడి జనంలో చులకన కావొద్దని ఆయన కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. గురువారం సచివాలయంలో ఉపాధ్యాయులపై బదిలీలపై రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. గురువారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ముద్రిత ప్రతిని ఎంఇఒకు సమర్పించాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈనెల 9న ఖాళీల జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. 10,11 తేదీల్లో ఖాళీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 20 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కలిపిస్తారు. ఈ నెల 26న బదిలీల తుది జాబితాను విడుదల చేస్తారు.

Kadiyam Comments on Congress

Comments

comments